చెవి రింగులు చోరి, పట్టుబడిన బాలీవుడ్ నటి! | Actress Swastika Mukherjee caught in while earings theft | Sakshi
Sakshi News home page

చెవి రింగులు చోరి, పట్టుబడిన బాలీవుడ్ నటి!

Published Wed, Nov 5 2014 2:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

చెవి రింగులు చోరి, పట్టుబడిన బాలీవుడ్ నటి!

చెవి రింగులు చోరి, పట్టుబడిన బాలీవుడ్ నటి!

సింగపూర్: చెవిరింగులు దొంగిలిస్తూ బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ పట్టుపడ్డారు. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు తన ప్రియుడు సుమన్ ముఖర్జీ తో కలిసి స్వస్తికా సింగపూర్ వెళ్లింది. చెవిరింగులు దొంగిలించిన చిత్రాలను సీసీటీవీ ఫుటేజ్ లో చూసి ఆ జ్యూవెలరీ షాప్ యజమాని అప్సర ఓస్వాల్ దర్పణ్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. 
 
'మేము ఫుటేజిలను చూశాం. 225 డాలర్ల విలువైన చెవిరింగులను దొంగిలించిన చిత్రాలను పరిశీలించాం. యాజమాన్యం ఫిర్యాదులో వాస్తవం ఉంది' అని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ధృవీకరించారు. అయితే స్వస్తికా పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నిర్వాహకులు తెలిపారు.  
 
అయితే ఈ ఘటనలో స్వస్తికా అమాకురాలని, చెవిరింగులకు నగదు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ ఘటనను వివాదంగా మార్చకుండా తగు చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. తన ప్రియుడితో కలిసి స్వస్తికా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.  గతంలో ప్రియుడితో గొడవపడి స్వస్తికా ముఖర్జీ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. 'డిటెక్టివ్ బ్యోంకెష్ భక్షి' చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన స్వస్తికా ముఖర్జీ నటిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement