
SRH VS RR: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఇవాళ (మార్చి 29) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ బలంగా కనిపిస్తుండగా.. ఇందు భిన్నంగా ఎస్‌ఆర్‌హెచ్ బలహీనంగా కనిపిస్తుంది. రికార్డుల పరంగా చూస్తే.. ఇరు జట్లు దాదాపు సమంగానే (15 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ 8 విజయాలు, ఆర్‌ఆర్ 7 విజయాలు) కనిపిస్తున్నప్పటికీ.. ఈ సీజన్‌లో రాజస్థాన్ కాస్త బలంగా ఉందనేది బహిరంగ రహస్యం.
Gooooood morning 👀 pic.twitter.com/HHwa9pR0um
— Rajasthan Royals (@rajasthanroyals) March 29, 2022
అయితే, పేపర్‌పై ఈ బలాన్ని చూసుకుని రాజస్థాన్ రాయల్స్.. ఎస్‌ఆర్‌హెచ్‌పై ట్రోలింగ్‌కు దిగడం ఆ ఫ్రాంచైజీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇవాళ ఉదయం రాజస్థాన్ ‘ఆరెంజ్ జ్యూస్’ ఫోటోను ట్వీట్ చేసి, ‘గుడ్ మార్నింగ్’ అనే కాప్షన్ జోడించి ఎస్‌ఆర్‌హెచ్‌ను పరోక్షంగా కవ్వించింది. ఈ ట్వీట్‌తో ఆర్‌ఆర్.. ఎస్‌ఆర్‌హెచ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆరెంజ్ జ్యూస్‌ను పిండేస్తామని అర్ధం వచ్చేలా ఆర్‌ఆర్ ట్వీట్ ఉండటంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
గతంలో కూడా ఆర్‌ఆర్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ముందు ఇలాంటి పోస్టే చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 2020 సీజన్ రెండో మ్యాచ్‌కు ముందు ‘ఈ రాత్రికి హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేశాం’ అంటూ పోస్టు చేసింది. అయితే, ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కొట్టిన దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆర్‌ఆర్ మరోసారి అలాంటి ట్వీటే చేయడంతో.. ఈసారి కూడా అలాంటి దెబ్బే తప్పదని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు.
చదవండి: ఎన్నడూ లేనంత బలంగా రాజస్థాన్.. ఏమాత్రం అంచనాలు లేకుండా ఎస్‌ఆర్‌హెచ్..!
Comments
Please login to add a commentAdd a comment