అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థను, ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌ను కార్నర్ చేయాలని సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టి ట్రోలర్ చేతికి చిక్కింది. ఇంతకీ గూగుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటని అనుకుంటున్నారా?
యాపిల్ సీఈవో టిమ్ కుక్ కొత్త యాపిల్ ప్రొడక్ట్‌లను పరిచయం చేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. #TakeNote అనే హ్యాష్ ట్యాగ్‌ను యాడ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్‌ను తరచుగా ట్విట్టర్‌లో NBA ఫుట్‌బాల్ టీమ్ ఉటా జాజ్ ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. యాపిల్ ప్రొడక్ట్ గురించి ట్వీట్ చేస్తూ #TakeNote,NBA టీం గురించి ఎందుకు ప్రస్తావించారనే విషయాన్ని వెల్లడించలేదు.
ఆ ట్వీట్‌కు గూగుల్ స్పందించింది. గూగుల్ తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి టిమ్‌కు రిప్లయి ఇచ్చింది. ఏమని? “హ్మ్మ్మ్ ఒకే ,నేను నిన్ను చూస్తున్నాను. #TakeNote @NBA అభిమానులు...#టిమ్ ఫిక్సెల్ మిమ్మల్ని మీకు ఇష్టమైన టీమ్‌కి చేరువ చేసేందుకు ఇక్కడ ఉంది. మీ NBA టీంను గుర్తించి అలెర్ట్ చేస్తుందంటూ సెటైర్లు వేసే ప్రయత్నం చేసింది.
కానీ అక్కడే గూగుల్ ఇరుక్కుపోయింది. ఎందుకంటే గూగుల్ పై ట్వీట్ చేసి యాపిల్ ఐఫోన్‌తో. ఇది గమనించిన నెటజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి👉‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్
Comments
Please login to add a commentAdd a comment