SS Rajamouli Movie: Boycott RRR in Karnataka Trending On Social Media - Sakshi
Sakshi News home page

Boycott RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌కు నిరసన సెగ, బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌

Mar 23 2022 11:54 AM | Updated on Mar 23 2022 2:13 PM

Boycott RRR in Karnataka Trending In Social Media - Sakshi

తాజాగా సోషల్‌ మీడియాలో కన్నడిగుల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకు ప్రధాన కారణం ఆర్‌ఆర్‌ఆర్‌ కన్నడ భాషలో రిలీజ్‌ కాకపోవడమే! అసలే కన్నడిగులు భాష కోసం ప్రాణమిస్తారు. అందులోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండంతో మరి కన్నడ వర్షన్‌ మాటేమిటి? అంటూ మండిపడుతున్నారు

Boycott RRR in Karnataka: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం కోసం వందలకోట్లు ఖర్చుపెట్టింది చిత్రయూనిట్‌. అంతేనా, దీని ప్రమోషన్లకు సైతం కోట్లు గుమ్మరిస్తున్నారు మేకర్స్‌. ఇటీవలే కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఘనంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్‌ఆర్‌ఆర్‌ దేశం గర్వించదగ్గ సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. కానీ తాజాగా సోషల్‌ మీడియాలో కన్నడిగుల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకు ప్రధాన కారణం ఆర్‌ఆర్‌ఆర్‌ కన్నడ భాషలో రిలీజ్‌ కాకపోవడమే!

అంత పెద్ద ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కర్ణాటకలో జరిపారు కానీ కన్నడ భాషలోకి సినిమాను అందుబాటులోకి తీసుకురావడం మరిచేపోయారు. అసలే కన్నడిగులు భాష కోసం ప్రాణమిస్తారు. అందులోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండంతో మరి కన్నడ వర్షన్‌ మాటేమిటి? అంటూ మండిపడుతున్నారు ఆ ప్రాంతీయవాసులు. ఒకరకంగా ఇది కన్నడ భాషను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాషలో అందుబాటులోకి తెస్తే తప్ప ఈ సినిమాను చూసేదే లేదంటూ శపథం పూనుతున్నారు. ఈ నేపథ్యంలో బాయ్‌కాట్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ ఇన్‌ కర్ణాటక(#BoycottRRRinKarnataka) హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ రివ్యూ: సినిమాను మిస్‌ కాకుండా చూడాల్సిందే!

Shanaya Kapoor: లగ్జరీ కారు కొన్న నటుడి కుమార్తె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement