Priyamani Opened Up About Self-Care and Body Positivity - Sakshi
Sakshi News home page

Priyamani: నోటికొచ్చినట్లు అనేస్తుంటారు, జీర్ణించుకోలేకపోయేదాన్ని: ప్రియమణి

Published Mon, Apr 11 2022 7:37 PM | Last Updated on Mon, Apr 11 2022 9:04 PM

Priyamani Opened Up About Self Care and Body Positivity - Sakshi

నచ్చితే పొగడటం, నచ్చకపోతే తిట్టిపోయడం నెటిజన్లకు అలవాటే. సోషల్‌ మీడియా వచ్చాక విమర్శలు మరీ హద్దుదాటిపోతున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను ఈజీగా టార్గెట్‌ చేస్తున్నారు. వారి ఆకృతి నుంచి డ్రెస్సింగ్‌, మాట తీరు, ప్రవర్తన.. ఇలా అన్నిరకాలుగా విమర్శిస్తున్నారు. కొందరు ఈ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోకపోయినా మరికొందరు మాత్రం ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్లిస్తుంటారు.

తాజాగా హీరోయిన్‌ ప్రియమణి ఈ ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. 'చాలామంది సోషల్‌ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అనేసే హక్కు ఉందని ఫీలవుతారు. నిజానికి నా మీద వచ్చే మీమ్స్‌ చూసి నవ్వుకునేదాన్ని. కానీ కొన్ని హద్దు మీరుతూ ఇష్టారీతిన చేసే కామెంట్లు చూసి భరించలేకపోయేదాన్ని. అలాంటప్పుడు వెంటనే వాళ్లను బ్లాక్‌ చేసేదాన్ని. ఎందుకంటే సోషల్‌ మీడియానే జీవితం కాదు, అది కేవలం లైఫ్‌లో ఒక భాగం మాత్రమే. అభిమానులు నన్ను ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా మరేం పర్వాలేదు' అని చెప్పుకొచ్చింది.

శరీరాకృతి గురించి మాట్లాడుతూ.. 'పెద్దపెద్ద వర్కవుట్స్‌ చేయాలని నేనెప్పుడూ చెప్పను. మీరు ప్లస్‌ సైజ్‌లో(లావుగా) ఉన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఖాళీగా ఫోన్లు చూస్తూ కూర్చునే బదులు మనకు ఏదవసరమో అది చేస్తే బాగుంటుంది. ఆ సమయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉపయోగిస్తే బెటర్‌. చిన్నచిన్న వర్కవుట్స్‌ లేదా ఇంటిపనులు చేసినా సరిపోతుంది' అని పేర్కొంది ప్రియమణి.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌

 మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement