ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్ సంగీత దర్శకుడు కీరవాణితో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ యాంకర్ ఎన్టీఆర్‌ని ఇంటర్వ్యూ చేయగా.. అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్‌లో తారక్ ఇరగదీశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. ఫేక్ యాక్సెంట్ అంటూ కొంతమంది నెటిజన్స్ ఎన్టీఆర్‌ని ట్రోల్స్ చేశారు.
తాజాగా దీనిపై ఎన్టీఆర్ పరోక్షంగా స్పందించారు. ఒక్కో జోన్‌లో ఒక్కో యాస ఉండడం సహజమని, కాలమానం, యాసల పరంగా తమ మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ.. పశ్చిమ దేశాల్లో ఒక నటులు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో.. తూర్పు దేశాల్లోనూ అలాగే ఉంటుందని అన్నారు. ‘నాటు నాటు’పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా.. ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విధంగా స్పందించారు.
అలాగే రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘రాజమౌళి..తన చిత్రాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించిన వ్యక్తి. సినిమా సినిమాకు మరింత వృద్ధి చెందుతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్`ని వెస్ట్ కి తీసుకెళ్లాలనేది ఆయన ప్లాన్. దక్షినాదిలోని టాలీవుడ్ అనే చిన్న పరిశ్రమకు చెందిన మేము.. ఆర్‌ఆర్‌ఆర్ కారణంగా ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment