లోలోన కుమిలిపోతూనే.. పవర్‌ లెస్‌గా పవన్‌ కల్యాణ్‌ | Trolling On Social Media About Pawan Being Limited To 21 Seats | Sakshi
Sakshi News home page

లోలోన కుమిలిపోతూనే.. పవర్‌ లెస్‌గా పవన్‌ కల్యాణ్‌

Published Tue, Mar 12 2024 12:57 PM | Last Updated on Tue, Mar 12 2024 3:38 PM

Trolling On Social Media About Pawan Being Limited To 21 Seats - Sakshi

చిక్కిపోతున్న పవన్ కల్యాణ్.. జనసేన

అధికారంలో వాటా తీసుకుంటాం.. ప్రశ్నిస్తాం.. బాధ్యతగా ఉంటాం.. రాష్ట్రాన్ని మోస్తాం అంటూ హడావుడి చేసిన పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు సాంతం నాకేసాడు.. సీట్ల షేరింగ్.. సింహభాగం మాకే అంటూ వచ్చిన జన సైనికులకు నోట మాట రానివిధంగా జస్ట్ 24 ఎమ్మెల్యే సీట్లు మొహాన కొట్టిన చంద్రబాబు పవన్ నోరు మూయించారు. అయితే దానికి సేనాని ఇచ్చిన సమర్థింపు చూస్తే నవ్వాగదు.. అత్యంత శక్తిమంతమైన గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము పవర్ ఫుల్ గా 24 సీట్లు తీసుకున్నాం అని సమర్థించుకున్నారు.

ఇప్పుడు ఆ ఇరవై నాలుగులో మూడు సీట్లను బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అదేమీ తీరో.. అదేం పంపకమో కానీ నూట యాభై సీట్లున్న చంద్రబాబు వాటాలోంచి కాకుండా ఇరవై నాలుగు సీట్లున్న పవన్ వాటా సీట్లలోంచి మాత్రమే బీజేపీకి ఇవ్వాల్సి రావడం.. తన రాజకీయ మనుగడ మీద ఏమాత్రం సోయి ఉన్నవాడైనా దీనికి అంగీకరించరు కానీ పవన్ మాత్రం బాబు ఎలా చెబితే అలా ఆడుతున్నారు.

ఇక ఇప్పుడు ఆ ఇరవై ఒక్క సీట్లకు కూడా అభ్యర్థులను చంద్రబాబే సూచిస్తారు.. అయన చెప్పినవాళ్లకే జనసేన తరఫున సీట్లు దక్కుతాయి. ఇక ఇప్పుడు 21 సీట్లకు పవన్ కల్యాణ్‌ పరిమితం అవ్వడం పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. ఇప్పుడిచ్చిన 21 సీట్లను ఎలా సమర్థించుకుంటావు పవన్ అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్కుల్లో కామెంట్స్.. చురకలు.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

స్కాండియం యొక్క పరమాణు సంఖ్య -21
కోడి పొదగడానికి పట్టే సమయం -21 రోజులు.
ఈరోజు డేట్ 12...దాన్ని తిరగేస్తే వచ్చేది -21
వినాయకుడి కి పూజ చేసే ఆకుల రకాలు 21
మొత్తం Alphabets without vowels  - 21
నేనూ ఏడు అడుగులు మూడు సార్లు వేసా 7×3=21 
పెళ్లి చేసుకోడానికి కనీస వయసు -21 ఏళ్ళు.
21st century = 21 సీట్లు
జగన్ పుట్టినరోజు -21...

ఇలా చెప్పుకుంటూ పోస్టింగులు పెడుతున్నారు. మరోవైపు బీజేపీలోకి కూడా చంద్రబాబు తన కార్యకర్తలను పంపుతూ ఆ పార్టీని కబ్జా చేస్తున్నారని, గతంలో ఏదైతే జరిగినదో, బీజేపీకి ఎలా నష్టం చేకూర్చారో ఇప్పుడూ అదే చేస్తున్నారని హార్డ్ కొర్ బీజేపీ క్యాడర్ ఆవేదన చెందుతోంది. ఇక జనసేన పరిస్థితి కూడా ఐస్ ముక్క మాదిరి క్షణక్షణానికి కరిగిపోతూ ఎన్నికలనాటికి ఏ ఐదారు.. పది సీట్లకు పరిమితం అయినా అవ్వొచ్చని జనసైనికులు లోలోన కుమిలిపోతున్నారు. చంద్రబాబుతో పొత్తు.. మా పవన్ కల్యాణ్ చిత్తు చిత్తు అని కామెంట్స్ చేస్తున్నారు
-సిమ్మాదిరప్పన్న

ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్‌లైన్‌ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement