చంద్రబాబు చర్యలు ఊహాతీతం! | Internet Trolls Chandrababu Naidu Vision Amid Weird Statements | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చర్యలు ఊహాతీతం!.. ప్రతిపక్ష నేత ‘ ఫన్నీ విజన్‌’పై పేలుతున్న సెటైర్లు

Published Fri, Aug 18 2023 8:42 PM | Last Updated on Fri, Aug 18 2023 8:59 PM

Internet Trolls Chandrababu Naidu Vision Amid Weird Statements - Sakshi

‘‘లైట్‌ వేసి చూపించండి. అందరూ సంఘీభావంగా ఒక్క నిమిషం లైట్‌ వేయండి. సెల్‌ఫోన్లు అందరూ కూడా ఆన్‌ చేయాలి.  ఏం తమ్ముళ్లూ.. ఆకాశంలోని నక్షత్రాలు వెలిగిపోతున్నాయి మన టార్చ్‌ లైట్‌లతో. అది టెక్నాలజీ స్టింట్‌.  ఇది కూడా ఇంట్రెడ్యూస్‌ చేసింది నేనే’’ ‘అంటే..’.. యస్‌ సెల్‌ఫోన్‌లో టార్చ్‌లైట్‌ను కనిపెట్టంది బాబుగారే అన్నమాట.

నలభై ఏళ్లకు పైగా రాజకీయానుభవం. నోరు తెరిస్తే.. హైదరాబాద్‌ను కట్టించింది నేనే.. కంప్యూటర్‌ను తెప్పించింది నేనే అంటూ టెక్నాలజీ పితామహుడిలా ఉపన్యాసాలు దంచే చంద్రబాబుగోరు.. తాను మీమ్‌ స్టఫ్‌గా మారతానని ఏనాడూ ఊహించి ఉండరేమో!. ఓవైపు కుళ్లు రాజకీయాలు ప్రదర్శించడమే కాదు.. తన సీరియస్‌ కామెడీతో విపరీతంగా నవ్వించగలనని నిరూపించుకుంటూ పోతున్నారాయన.

ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసపెట్టి స్టేట్‌మెంట్లు ఇస్తూ పోతున్నారు.  ఇదేం రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న పని కాదు.. వరుసగా తాను చేస్తున్న ప్రకటనలతో మీమర్స్‌కు చేతి నిండా పని దొరుకుతుండగా.. తెలుగుతమ్ముళ్లు సైతం ఆ కామెడీని యమాగా ఎంజాయ్‌ చేసేస్తున్నారు. ఆ గోలనే ఆయన పొగడ్తలు అనుకుంటున్నారేమో.. రెచ్చిపోయి మరీ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాయి. 

బీకాంలో ఫిజిక్స్‌ స్టేట్‌మెంట్‌కు తానేమీ తీసిపోనని చెబుతూ.. బైపీసీలో ఇంజినీరింగ్‌ కామెంట్‌ చేశారు.  ఆ వెంటనే 45 రోజుల రాఖీ పూజలతో బాబా అవతారం ఎత్తి.. ఫన్నీగా ట్రోల్‌ అయ్యాడు. మరోసారి గ్యాప్‌ ఇవ్వకుండానే.. సెల్‌ఫోన్‌.. దాని టార్చ్‌లైట్‌ను కనిపెట్టింది తానేనంటూ బాబుగోరు.. మరొకటి ఏసేశారు.

నలభై ఏళ్ల పైన ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ సుపరిచితుడైన బాబుగారు.. ఇప్పుడెలా అయ్యారసలు?. నవ్వుకోవాలో.. జాలిపడాలో అర్థం కావడం లేదు. అధికారం కోల్పోవడం.. కొడుకు లోకేశం దమ్ము లేక ‘దద్దమ్మ’ ట్యాగ్‌ తగిలించుకోవడం, దత్తపుత్రుడి దగ్గర సరైన మ్యాటర్‌ లేకపోవడంతో.. చంద్రబాబుకు మతి భ్రమించి ఉండొచ్చు అనే పొలిటికల్‌ కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

యస్‌.. చంద్రబాబు లాంటి సీనియర్‌ పొలిటీషియన్‌ చేస్తున్న చేస్తున్న వ్యాఖ్యలు విన్న జనాలు నవ్వుకుంటున్నారు. తమ అధినేత ఇలా అయిపోయారేంటని టీడీపీ కార్యకర్తలు సైతం ఫీలవుతున్నారు. అధికారం కోసం హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా ఏళ్లపాటు  ప్రజల్ని మోసం చేసిన విజనరీ బ్లఫ్‌మాస్టర్‌ చంద్రబాబు. అధికార దాహంతో తల్లడిల్లితున్న ఆ పెద్దమనిషి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చేసే ప్రయత్నాలు(కుట్రలు) ఫలించడం లేదు. ఇలాంటి తరుణంలో బాబుగారి ఈ కొత్త విజన్‌ భరించడం మాత్రం మా వల్ల కాదు బాబోయ్‌ అనుకుంటున్నారు జనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement