Manchu Vishnu Sensational Comments On A Star Hero Over His Trolling On Social Media - Sakshi
Sakshi News home page

Manchu Vishnu : 'ట్రోలింగ్‌ చేయిస్తున్న ఆ బడా హీరో ఎవరో అందరికీ తెలుసు'

Published Tue, Oct 18 2022 11:22 AM | Last Updated on Tue, Oct 18 2022 12:38 PM

Manchu Vishnu Commments About The Hero Behind Trolls On Social Media - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా.  ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు విష్ణు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆయన తనపై ట్రోలింగ్‌ చేస్తున్నది ఎవరన్నదానిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ఓ బడా హీరో తనను కావాలనే టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేయిస్తున్నట్లు విష్ణు కొన్నిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బడా హీరో ఎవరన్నది బయటపెట్టే ఉద్దేశం ఉందా అని అడగ్గా.. ఆ హీరో ఎవరో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని, తన నోటితో చెప్పాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. 'మా ఎలక్షన్స్‌ టైం నుంచి నాపై ట్రోలింగ్‌ మొదలయ్యింది.

మనుషులను పెట్టి పెయిడ్‌ ట్రోలింగ్‌ చేయిస్తున్నాడు. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నాడని తెలిసింది. అతని ఎవరో మీడియాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఆయన పేరు రివీల్‌ చేయడం లేదు' అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో విష్ణు వ్యాఖ్యల వెనకున్న ఆ బడా హీరో ఎవరన్నదానిపై నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement