జిన్నా రిలీజ్‌ కాకముందే నెగెటివ్‌ రివ్యూలు: మంచు విష్ణు వార్నింగ్‌ | Manchu Vishnu Warns YouTube Channels Over Giving Negative Reviews On Ginna | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: ఎందుకింత ద్వేషం, సినిమా రిలీజ్‌ కాకుండానే నెగెటివ్‌ రివ్యూలా!

Published Thu, Oct 20 2022 9:07 PM | Last Updated on Thu, Oct 20 2022 9:46 PM

Manchu Vishnu Warns YouTube Channels Over Giving Negative Reviews On Ginna - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జిన్నా. సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇషాన్‌ సూర్య డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. అయితే జిన్నా రిలీజ్‌ కాకముందే సినిమా బాగోలేదంటూ కొందరు విషప్రచారం చేస్తున్నారు. జిన్నాపై నెగెటివ్‌ రివ్యూలు ఇస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లపై మండిపడ్డాడు మంచు విష్ణు. ఆ ఛానళ్ల పేర్లు, వాటి యూఆర్‌ఎల్స్‌ ను ట్విటర్‌లో షేర్‌ చేసిన మంచు త్వరలోనే వాటిని మూసేయిస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు.

'ఊహించిందే జరిగింది. ఇదిగో పెయిడ్‌ బ్యాచ్‌ను మీ ముందుకు తీసుకువచ్చాను. జిన్నా ఇంకా రిలీజ్‌ అవనే లేదు, వీళ్లేమో అప్పుడే నెగెటివ్‌ రివ్యూలు ఇవ్వడం మొదలు పెట్టేశారు. ఎందుకింత ద్వేషం? త్వరలోనే మేము ఆ ఛానళ్లను మూసేస్తామని వారు గ్రహిస్తారని ఆశిస్తున్నాను' అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. కాగా అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ మూవీ రేపు తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

చదవండి: దరిద్రం ఏంటంటే మనవాళ్లకు ఆ హీరోయిన్సే కావాలి
కొత్త ఫ్లాట్‌ కొన్న బుల్లితెర నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement