ఆమె అలాగే కనిపించాలి.. ట్రోలింగ్‌పై అనన్య తండ్రి షాకింగ్‌ కామెంట్స్‌ | Chunky Panday Reacts To Trolls His Daughter Ananya Panday | Sakshi
Sakshi News home page

Chunky Panday: అనన్య గ్లామరస్‌గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే

Published Tue, Mar 22 2022 9:13 PM | Last Updated on Tue, Mar 22 2022 9:54 PM

Chunky Panday Reacts To Trolls His Daughter Ananya Panday - Sakshi

Chunky Panday Reacts To Trolls His Daughter Ananya Panday: బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ఇటీవల దర్శకనిర్మాత హోస్ట్‌ చేసిన పార్టీలో దర్శనమిచ్చింది. ఆ పార్టీలో ఆమె ధరించిన బ్లాక్‌ డ్రెస్‌తో ట్రోలింగ్‌ గురైంది. అనన్య బోల్డ్‌ డ్రెస్‌ వేసుకోవడంతో నెటిజన్స్‌ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్రోల్‌ చేశారు. ఈ ట్రోలింగ్‌పై అనన్య తండ్రి చుంకీ పాండే స్పందించారు. అనన్య ఎలాంటి దుస్తులు ధరించాలో తానెప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. తాను అతని భార్య తమ పిల్లలకు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏవి వేసుకోకూడదు అని ఎలాంటి కండిషన్స్‌ పెట్టలేదని వివరించారు. 

చదవండి: ఇదేం ఎక్స్‌పోజింగ్‌.. హీరోయిన్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

'మేము మా ఇద్దరు కూతుళ్లను చాలా బాగా పెంచాం. వారు చాలా తెలివైనవారు. అనన్య ఇప్పుడు గ్లామర్‌ ప్రపంచంలో ఉంది. ఆమె గ్లామరస్‌గా కనిపించాలి. అది ఆమెకు అవసరం. నేను కచ్చితంగా చెప్పగలను మా పిల్లలు వల్గర్‌గా కనిపించకుండా దుస్తులు ధరించగలరు. నేను అనన్యతో చెప్పాను ఏదేమైనా ప్రజలైతే నీ గురించి మంచిగా అయినా చెడ్డగా అయినా మాట్లాడుకుంటున్నారు' అని చుంకీ పాండే తెలిపారు. 

చదవండి: పార్టీలో హీరోయిన్‌తో విజయ్‌ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ

చుంకీ పాండే, భావన దంపతులకు అనన్య, రైసా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీకి రౌడీ హీరో విజయ్‌, డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఛార్మీ, అనన్య కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే  అనన్య వేసుకున్న డ్రెస్‌ను నెటిజన్లు తెగ ట్రోల్‌ చేశారు. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్‌ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement