![Bollywood Actress Ananya Panday Emotional Tribute Late Grandmother - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/11/ananya.jpg.webp?itok=ilsg7HK_)
హీరోయిన్ అనన్య పాండే ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ, నటుడు చుంకీ పాండే తల్లి స్నేహలత(85) పాండే శనివారం తుది శ్వాస విడిచింది. దీంతో అనన్య ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. నానమ్మను అంటిపెట్టుకుని ఉండే అనన్య ఆమె ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు కన్నీటి నివాళులు అర్పించింది.
"రెస్ట్ ఇన్ పవర్ మై ఏంజెల్. మా నానమ్మకు పుట్టుకతోనే గుండెలోని ఒక కవాటం సరిగా లేదు. దీంతో ఆమె ఎక్కువ కాలం బతకలేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. కానీ మా దాదీ బతికి చూపించింది. 85 ఏళ్ల వయసులోనూ తను అలుపెరగకుండా పని చేసేది. ప్దొదున్నే ఏడు గంటలకల్లా రెడీ అయి పనికి వెళ్తుంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. ప్రతిరోజు ఆమె నుంచి స్ఫూర్తి పొందుతూనే వచ్చాను. ఆమె చేతిలో పెరిగి ఇంతటిదాన్ని అయినందుకు చాలా గర్వంగా ఉంది" అని అనన్య పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. నానమ్మతో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోలను కూడా షేర్ చేసింది. కాగా అనన్య తెలుగులో 'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment