
ఇటీవలే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది రవీనా టండన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ బాలీవుడ్ నటి. 'కేజీఎఫ్ 2 సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయంటే సౌత్ ఇండస్ట్రీ డబ్బులు సంపాదించడం మీదే దృష్టి పెట్టిందని కాదర్థం. సినిమా మీద వారికెంత ప్రేముందనేది అక్కడ స్పష్టమవుతోంది. పైగా ఆ కలెక్షన్ల వల్ల థియేటర్ యజమానులకు లాభం కూడా చేకూరుతోంది' అని చెప్పుకొచ్చింది.
గతంలో ప్రసవానంతరం లావెక్కడంపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ.. 'గర్భంతో ఉన్నప్పుడు లావయ్యాను. బాబుకు జన్మనివ్వగానే తిరిగి వర్కవుట్స్ మొదలుపెట్టాను. కానీ అప్పటికే లావయ్యానంటూ నన్ను, అటు ఐశ్వర్య రాయ్‌ను కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న నాకింకా గుర్తుంది. మీరు బరువు పెరిగారు, కాబట్టే పెద్దగా కష్టపడకుండా రియాలిటీ షోలు చేస్తున్నారా? అని అడిగారు. అప్పుడు నేనొక్కటే చెప్పా... బ్రదర్, నేను నా బరువు తగ్గించుకోగలను, కాని నీ ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటావు?' అని కౌంటర్ ఇచ్చాను అని గుర్తు చేసుకుంది.
చదవండి: ఈ వ్యాధి వల్ల తీవ్ర నొప్పి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
ద పీకాక్’ మ్యాగజైన్‌పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment