సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని పట్టించుకోనని, కామెంట్స్‌ని కూడా చూడనని చెబుతోంది మెగా డాటర్ నిహారిక. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
(చదవండి: ‘బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?)
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ట్రోల్స్ చేసే వాళ్ల గురించి స్పందించింది. పని పాట లేనివాళ్లే ట్రోల్స్ చేస్తారని, అలాంటి వారి గురించి తాను పట్టించుకోబోనని చెప్పుకొచ్చింది. ‘మనం అవసరం లేనివాళ్లకి అటెన్షన్ ఇస్తాం. ప్రతి చోట ఇడియట్స్ ఉంటూనే ఉంటారు. వాళ్లను మనం పట్టించుకుంటే ‘నా వెదవతనం వల్ల ఇంత అటెన్షన్ ఇస్తున్నారు’ అనుకొని ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు.
(చదవండి: శర్వానంద్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..)
నా వరకు అయితే.. అలాంటి వాళ్లను అస్సలు పట్టించుకోను. నేను అంటే ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు ఇష్టమైన వాళ్లు కూడా ఉన్నారు. నాకు ఖాళీ సమయం దొరికితే వాళ్లకు కేటాయిస్తా. ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? ఒకప్పుడు సోషల్ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్‌ను చూసేదాన్ని. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఎవడో ఏదో కామెంట్ చేస్తే నేను ఎందుకు చూడాలి. దాని వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే సోషల్ మీడియా రూమర్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను’అని నిహారిక చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment