
సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్‌పై మెగా డాటర్ నిహారిక స్పందించారు. ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో మరాద్య లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆమె ప్రధాన పాత్ర నటించిన ‘డెడ్ పిక్సెల్స్’అనే వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. యాక్టింగ్‌పై ఆసక్తితోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని, వెండితెర, ఓటీటీ.. ఏదైనా వందశాతం కష్టపడి పని చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి మాట్లాడుతూ..‘వాటిని నేను పెద్దగా పట్టించుకోను.
(చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!)
మొదట్లో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని చూసేదాన్ని. బాధపడేదాన్ని. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేశా. అంతేకాదు కొన్ని రూమర్స్ చూసి నవ్వుకుంటాను. సైరా సినిమా సమయంలో నాపై వచ్చిన మీమ్స్ చూసి పడి పడి నవ్వాను’ అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే రామ్ చరణ్ ఐపీఎల్‌లో ఒక టీమ్ కొనుగోలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘అవునా.. ఏ టీమ్ కొంటున్నారు? ఏమో మరి నాకు అయితే తెలియదు. ఇంటర్వ్యూ అయ్యాక అన్నయ్యను అడగాలి’అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment