
చాలాకాలం గ్యాప్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ యాక్టింగ్ వైపు దృష్టి మళ్లించింది. ప్రస్తుతం ఆమె డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మే 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజవగా అందులో నిహారిక చెప్పిన డైలాగ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గేమర్‌గా కనిపించిన నిహారిక ఆన్‌లైన్‌లో ఒకరిని ఇష్టపడుతుంది. ఆఫ్‌లైన్‌లో మరొకరిని ఇష్టపడుతుంది. ఇద్దరిలో ఎవరిని భాగస్వామిగా సెలక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. ఆ సమయంలో 'నాకు బెడ్‌పై రోషన్ కావాలి.. కానీ మైండ్‌లో భార్గవ్ ఉన్నాడు (రోషన్ ఇన్ బెడ్.. భార్గవ్ ఇన్ ద హెడ్)' అని డైలాగ్ చెప్తుంది. ఇది చాలామందికి నచ్చలేదు. ఇలాంటి డైలాగులు అవసరమా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావంటూ నిహారికను ఏకిపడేస్తున్నారు. మరి ఈ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో ఈ విమర్శలకు నిహారిక ఎలా చెక్ పెడుతుందో చూడాలి!
ఇకపోతే నిహారిక కొంతకాలంగా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాక పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేశారు. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ ఇంతవరకు దీనిపై అటు నిహారిక, ఇటు చైతన్య స్పందించనేలేదు.
చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్, ఎట్టకేలకు క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment