'ఇంకా పెళ్లి చేసుకోలేదే'.. నోరు మూసుకో.. ఇంకోసారి! | Shamita Shetty Befitting Reply Who Shamed Her For Being Unmarried At 45 | Sakshi
Sakshi News home page

'50 ఏళ్లు ద‌గ్గ‌ర‌ప‌డ్తున్నాయ్‌.. ఇంకా పెళ్లి ముచ్చ‌టే లేదు! 'న‌టి సాలిడ్ రిప్లై

Published Fri, Feb 23 2024 6:21 PM | Last Updated on Fri, Feb 23 2024 6:28 PM

Shamita Shetty Befitting Reply Who Shamed Her For Being Unmarried At 45 - Sakshi

నాకు త్వ‌ర‌గా పెళ్లి చేసేయండి నాన్నా.. అని చెప్పేవాళ్లు సినిమాలోనే క‌నిపిస్తారు. నిజ జీవితంలో చాలా అరుదుగా ఉంటారు. అప్పుడే పెళ్లేంటి? కొన్నాళ్లు స్వేచ్ఛ‌గా బ‌త‌క‌నివ్వొచ్చుగా.. ఇప్ప‌ట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం, ఆస‌క్తి ఎంత‌మాత్ర‌మూ లేద‌ని తేల్చి చెప్తుంటారు. సెల‌బ్రిటీలైతే కెరీర్ వెన‌క పరిగెడుతూ పెళ్లి విష‌యాన్నే మ‌ర్చిపోతుంటారు. ఈ క్ర‌మంలో ఎంతోమంది తార‌లు చాలా ఆల‌స్యంగా వివాహం చేసుకోగా కొందరు మాత్రం లేటైపోయింద‌ని పెళ్లినే లైట్ తీసుకుంటారు.

నీ జీవితంలో ఇంత‌వ‌ర‌కు..
బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి సోద‌రి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ ష‌మితా శెట్టికి 45 ఏళ్లు. ఇప్ప‌టికీ సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. త‌న‌ను చూసి కుళ్లుకుందో ఏమో కానీ ఓ మహిళ‌ నోటిదూల‌తో సోష‌ల్ మీడియాలో న‌టిపై సెటైర్లు వేసింది. 'నీకు 50 ఏళ్లు వ‌చ్చేస్తున్నాయ్‌.. ఇంత‌వ‌ర‌కు నీ జీవితంలో మ‌గాడే లేడు' అంటూ ప‌రోక్షంగా పెళ్లి చేసుకోలేద‌ని దెప్పిపొడిచింది. ఈ కామెంట్ చూసి చిరాకొచ్చిన ష‌మిత దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

నా జీవితానికి పెళ్లి..
'ఇక్క‌డో ద‌యామ‌యురాలైన ఓ మ‌హిళ నేను పెళ్లి చేసుకోలేద‌ని, న‌న్ను చుల‌క‌న చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఆమెకోసం కాస్త స‌మ‌యం కేటాయించైనా రిప్లై ఇవ్వాల‌నుకున్నాను.. అందుకోస‌మే ఇది! ముందుగా నీకు అభినంద‌న‌లు. నువ్వు అనుకుంది సాధించావ్‌.. ఇక నువ్వు అన్న మాట‌ల‌కు నా స‌మాధాన‌మేంటంటే.. నా జీవితానికి పెళ్లి ఒక్క‌టే అర్థం, ప‌ర‌మార్థం కాదు. సంతోషంగా, తృప్తిగా, స్వ‌తంత్రంగా నా కాళ్ల‌పై నేను నిల‌బ‌డి జీవిస్తున్నాను.

నోరు మూసుకో..
నీ జీవితంలో కొంతైనా పాజిటివిటీతో బ‌తుకు. ఇంకోసారి ఏ అమ్మాయిని ఇలా కింద‌కు లాగేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌ని కోరుకుంటున్నాను. నీకు మంచి చెప్ప‌డానికి మాట‌లు రాక‌పోతే నోరు మూసుకుని నిశ్శ‌బ్దంగా ఉండ‌ట‌మే మేలు' అని ఘాటుగా కౌంటిచ్చింది. కాగా గ‌తంలో ష‌మితా శెట్టి.. రాకేశ్ అనే వ్య‌క్తిని ప్రేమించింది. వీరిద్దరూ బిగ్‌బాస్ షోలో ల‌వ్‌లో ప‌డ్డారు. కానీ షో అయిపోయిన కొంత‌కాలానికే విడిపోయారు.

చ‌ద‌వండి: ఐశ్వ‌ర్య‌పై నోరు జారేసుకున్న హీరో.. అక్క‌డున్న‌వాళ్లంతా షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement