కొండా సురేఖా ట్రోలింగ్‌ వ్యవహారంపై స్పందించిన హరీష్‌రావు | BRS Harish Rao Reacts On Minister Konda Surekha Troll Episode | Sakshi
Sakshi News home page

కొండా సురేఖా ట్రోలింగ్‌ వ్యవహారంపై స్పందించిన హరీష్‌రావు

Published Mon, Sep 30 2024 9:35 PM | Last Updated on Mon, Sep 30 2024 9:35 PM

BRS Harish Rao Reacts On Minister Konda Surekha Troll Episode

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్‌ మీడియాలో నడిచిన ‍ట్రోలింగ్‌ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని చెబుతూ.. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు.

‘‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరు. బీఆర్‌ఎస్‌ అయినా.. వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్‌ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్‌ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నా’’ అని ఎక్స్‌ వేదికగా హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కొండా సురేఖ కంటతడి.. సీతక్క వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement