![Netizens Slams Abhiroop Basu Who Criticize Kantara Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/31/kantara.gif.webp?itok=-wurbRJ-)
ఎక్కడ చూసినా కాంతార గురించే చర్చ నడుస్తోంది. అంతేనా? ఈ మూవీ కలెక్షన్లు కూడా రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. రిలీజైన ఐదు వారాల్లో ఈ సినిమా రూ. 245 కోట్లు రాబట్టింది. ప్రేక్షకులే కాదు తారలు సైతం రిషబ్ శెట్టి కాంతార మూవీ చూసి మంత్రముగ్ధులయ్యారు. అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. కానీ దర్శకుడు అభిరూప్ బసుకు మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. అందులో ఏముందని అంత ఎగబడుతున్నారు? అని వ్యంగ్యంగా మాట్లాడాడు. పైగా ఈ సినిమా ప్రజల తెలివితేటలను అపహాస్యం చేసిందని మండిపడ్డారు.
కథ చాలా పేలవంగా ఉందని, ట్విస్టులు ఏదో జిమ్మిక్కులు చేసినట్లుగా ఉన్నాయని, సినిమాకు అసలు ప్రామాణికతే లేదని వ్యాఖ్యానించాడు. ప్రజల జీవితాల్లో దైవ జోక్యాన్ని నమ్మాలని బలవంతం చేసినట్లుందన్నాడు. అందరూ క్లైమాక్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారని, కానీ తనకు క్లైమాక్స్ ఏమాత్రం నచ్చలేదని చెప్పుకొచ్చాడు. ఈ బోరింగ్ సినిమాను అనవసరంగా ఎక్కువ పొగిడేస్తున్నారన్నాడు. నెట్టింట వైరల్ అయిన ఈ కామెంట్లు రిషబ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. పబ్లిసిటీ కోసం అభిరూప్ బసు చీప్‌గా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దమ్ముంటే ఇలాంటి సినిమా ఒకటి తీసి, అప్పుడు మాట్లాడమని సవాలు విసురుతున్నారు.
చదవండి: సూర్య ఎలిమినేషన్‌కు నువ్వే కారణం.. ఇనయకు ఒకటే వాయింపు
వాటిని నేను పట్టించుకోను: రిషబ్ శెట్టి
Comments
Please login to add a commentAdd a comment