సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్‌తో చంపేశారని అన్నారు.
సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారని, జనాన్ని భయపెడుతున్నారని అన్నారు.
కాగా తనకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరిందంటూ తెనాలికి చెందిన గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూపై.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు అసభ్య పదజాలంతో దూషించారు. గీతాంజలి వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు.
దీంతో తీవ్ర మనోవేదనలకు గురైన ఆమె రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది.
చదవండి: ‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’
Comments
Please login to add a commentAdd a comment