Malaika Arora RespondsTrolls Calls People Criticising Her Outfit Hypocrites - Sakshi
Sakshi News home page

Malaika Arora: వాళ్లు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా? మండిపడ్డ హీరోయిన్‌

Mar 11 2022 3:35 PM | Updated on Mar 11 2022 5:13 PM

Malaika Arora RespondsTrolls Calls People Criticising Her Outfit Hypocrites - Sakshi

ఇండియన్‌ సెలబ్రిటీలు ఏం చేసినా విమర్శించే జనాలు విదేశీ తారలు ఏం చేసినా పొగడ్తలు కురిపిస్తుంటారు. ఫ్యాషన్‌ విషయంలో అయితే మరీనూ! తాము ఎలాంటి డ్రెస్‌ వేసుకున్నా ట్రోల్‌ చేసే జనాలు..

ఇంట్లో వండిన వంట కన్నా పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ఇండియన్‌ సెలబ్రిటీలు ఏం చేసినా విమర్శించే జనాలు విదేశీ తారలు ఏం చేసినా పొగడ్తలు కురిపిస్తుంటారు. ఫ్యాషన్‌ విషయంలో అయితే మరీనూ! తాము ఎలాంటి డ్రెస్‌ వేసుకున్నా ట్రోల్‌ చేసే జనాలు అదే డ్రెస్‌ హాలీవుడ్‌ తారలు జెన్నిఫర్‌ లోపెజ్‌, రిహానా వంటివారు వేసుకుంటే మాత్రం ఆహా, ఓహో అంటూ ఉప్పొంగిపోతారని విమర్శిస్తోంది హీరోయిన్‌ మలైకా అరోరా. ఆమె ఇలా చిర్రుబుర్రులాడటానికి బలమైన కారణమే ఉంది.

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా.. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఫర్హాన్‌ అక్తర్‌, శిబానీ దండేకర్‌ ఇంట్లో పార్టీకి వెళ్లింది. నెట్టెడ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఆమె ఫంక్షన్‌కు హాజరైంది. అయితే ఆమెను అలా చూసిన చాలామంది ఈ వయసులో ఇదేం డ్రెస్‌ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ ట్రోల్స్‌పై మలైకా స్పందిస్తూ.. రిహానా, జెన్నిఫర్‌ లోపెజ్‌, బేవన్స్‌ వంటివారు ఇలాంటి డ్రెస్‌ వేస్తే మెచ్చుకుంటారని సెటైర్‌ వేస్తూనే తనను తిట్టిపోసేవాళ్లను మోసగాళ్లని పేర్కొంది. నిజానికి మలైకా ట్రోలింగ్‌ పెద్దగా పట్టించుకోదు. కానీ తనను మరీ ఇబ్బంది పట్టే కామెంట్లు చూసినప్పుడు మాత్రం బాధపడతానని చెప్పుకొచ్చింది.

చదవండి: Indraja: నేను చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement