ట్రోలింగ్‌: ఆ నటి ముసలావిడైపోయింది! | Malaika Arora Trolled For Visible Stretch Marks | Sakshi
Sakshi News home page

పొట్ట మీద మచ్చలు: బాలీవుడ్‌ నటిపై ట్రోలింగ్‌

Published Tue, Jan 26 2021 3:29 PM | Last Updated on Tue, Jan 26 2021 7:58 PM

Malaika Arora Trolled For Visible Stretch Marks - Sakshi

ప్రసవం అయిన తర్వాత పొట్ట మీద మచ్చలు, చారలు ఏర్పడటం సహజం. దానికి సాధారణ మహిళల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ అతీతం కాదు. అయితే తాజాగా బాలీవుడ్‌ నటి మలైకా అరోరా వ్యాయామం చేసి బయటకు వచ్చిన సమయంలో ఆమె ఫొటోలను జనాలు క్లిక్‌మనిపించారు. ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా చాలా మంది ఆమె పొట్ట మీద ఉన్న స్ట్రెచ్ మార్కులను చూసి నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మలైకా ముసలిదైపోయిందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ ఎలా ఉంది? మీరెలా ఉన్నారని పోలుస్తూ ఆమెను కించపరుస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తల్లయ్యాక పొట్ట మీద మచ్చలు ఉండటం సర్వసహజమని చెప్పుకొస్తున్నారు. అయినా ఆమెను కావాలని టార్గెట్‌ చేస్తున్నారని, నిజానికి 40 ఏళ్ల వయసులో ఆమె ఎంతో అందంగా ఉందని, మీరైతే 20, 30 ఏళ్లకే ముడతలు పడ్డ వెల్లుల్లిలా కనిపిస్తారని ట్రోలింగ్‌ను తిప్పికొట్టారు. (చదవండి: కొడుకుతో నటి క్రికెట్‌ : ఫోటోలు చూస్తే ఫిదానే)

ఇదిలా వుంటే ఇద్దరు పిల్లల తల్లైన మలైకా ఇప్పటికీ ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెడతారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం తరచూ తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటారు. తను ఫిట్‌గా ఉండటమే కాక అభిమానులను కూడా ఫిట్‌గా ఉండాలని సూచిస్తుంటారు. కాగా మొదటి భర్త ఆర్భాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకున్న మలైకా ప్రస్తుతం అర్జున్‌కపూర్‌తో డేటింగ్‌ చేస్తోంది. తాజాగా అర్జున్‌ హీరోగా నటిస్తున్న 'భూత్‌ పోలీస్'‌ సినిమా సెట్స్‌కు సైతం వెళ్లి వచ్చినట్లు సమాచారం. (చదవండి: నటుడి  మైనస్‌ను ప్లస్‌ చేసిన దర్శకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement