
స్పెషల్ సాంగ్స్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ నటి మలైకా అరోరా. మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో పలు చిత్రాలు నిర్మించిన ఆమె టీవీ షోలతో పాటు ఓటీటీలోనూ మెరుస్తోంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె మలైకా పెళ్లెప్పుడన్నది మాత్రం చెప్పడం లేదు.
తాజాగా ఆమె ప్రియుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నా లేజీ బాయ్(బద్ధకస్తుడు)' అంటూ అర్జున్ ఒంటిపై దుస్తులు లేని ఫోటోను వదిలింది. ఇది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. 'ప్రేమకు వయసుతో పని లేదు, సరే, మీ జీవితం మీ ఇష్టం.. కానీ ఒక టీనేజ్ పిల్లవాడికి తల్లయి ఉండి సోషల్ మీడియాలో ఇలాగేనా ప్రవర్తించేది? నువ్విలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ అబ్బాయి బయట తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఎంతమంది అతడిని ప్రశ్నలతో గుచ్చిగుచ్చి చంపుతారు..'
'పాపం ఈమె చేసే చీప్ పనుల వల్ల అతడు తన స్కూల్ లేదా కాలేజీలో నవ్వులపాలు కావాల్సి వస్తోంది', 'అరె.. నీకేమైనా పిచ్చి పట్టిందా? మరీ హద్దు మీరుతున్నావు. ఇలాంటివి పోస్ట్ చేయడం అవసరమా?', 'సొంత కొడుకే తనతో ఎక్కువగా ఉండటానికి ఎందుకిష్టపడడో నాకిప్పుడు అర్థమవుతోంది', 'నీ బెడ్‌రూమ్ విషయాలు కూడా నెట్‌లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు' అని ట్రోల్ చేస్తున్నారు. కాగా మలైకా మూవింగ్ ఇన్ విత్ మలైకా షోతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అటు అర్జున్ కపూర్ లేడీకిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment