ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఫ్యాషన్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా వాకింగ్, జాగింగ్, పార్టీ, డిన్నర్ డేట్, టూర్.. ఇలా ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా స్పెషల్‌గా కనిపించేలా జాగ్రత్తపడుతుంటారు. ఈ క్రమంలో వారి స్టయిల్‌పై కొన్నిసార్లు విమర్శలు సైతం వ్యక్తమవుతుంటాయి. తాజాగా కరీనా కపూర్ కూడా ఈ విమర్శల బారిన పడింది.
ఇటీవల ఆమె గుస్సీ ఎల్లో టీషర్ట్‌తో బయట కనిపించింది. ఇంకేముందీ, అక్కడున్న ఫొటోగ్రాఫర్లు వెంటనే కెమెరాలకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. నెట్టింట అవి కాస్తా వైరల్‌గా మారగా ఆ టీషర్ట్ దరిద్రంగా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కరీనా రూ.40 వేలు పెట్టి కొనుకున్న టీ షర్ట్ అష్ట దరిద్రంగా ఉందని పెదవి విరుస్తున్నారు. 'నీ టేస్ట్ ఏడ్చినట్లుంది, మేము రూ.150 పెడితే మూడు టీషర్ట్స్ వచ్చాయి. నువ్వు వేసుకున్నదానికంటే అవే చాలా బాగున్నాయి' అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా కరీనా వార్డ్‌రోబ్‌లో గుస్సీ టీషర్ట్స్ 50 కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం.
చదవండి: నాన్న టార్చర్ పెడుతున్నాడు.. అభిమాని కష్టాలకు చలించిపోయిన హీరో
ఫ్యాన్స్ అత్యుత్సాహం! విక్రమ్ థియేటర్‌లో చెలరేగిన మంటలు
Comments
Please login to add a commentAdd a comment