సోషల్ మీడియా వచ్చాక ప్రశంసించడం, విమర్శించడం రెండూ ఈజీ అయ్యాయి. ఒకరిని మెచ్చుకోవాలన్నా, దుమ్మెత్తిపోయాలన్నా సోషల్ మీడియానే అస్త్రంగా వాడుతున్నారు. మరీ ముఖ్యంగా నచ్చిన సెలబ్రిటీలను ఆకాశానికెత్తేయడం లేదంటే వారిని ట్రోలింగ్ చేయడం సర్వసాధారాణమైపోయాయి. తాజాగా నెట్టింట్లో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అక్టోబర్ 10న లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొని సందడి చేసింది. రెండో సంతానం పుట్టిన 7 నెలలకే ర్యాంప్ వాక్‌పై హొయలొలికించింది. గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన తెల్ల గౌనును ధరించి స్టేజీపై మెరిసిపోయింది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్సు చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 'ముసలిదానివైపోయావు', 'మీకు వయసు ఎక్కువపైపోయింది, దాన్ని అంగీకరించండి', 'లావయ్యావు నాయనమ్మ', 'వయసు పైబడిన ఆంటీ' అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment