కిందపడ్డ ఎంగిలి మెతుకులు తిన్న రైతుబిడ్డ.. బయటేమో మరోలా.. | Bigg Boss Telugu 7: Trolling On Pallavi Prashanth - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: బయటేమో అన్నం పడేశావ్‌.. హౌస్‌లో ఎంగిలి మెతుకులు తిన్నావ్‌.. వాటే ఓవర్‌ యాక్టింగ్‌..

Published Fri, Sep 8 2023 2:17 PM | Last Updated on Fri, Sep 8 2023 2:46 PM

Bigg Boss Telugu 7: Trolling on Pallavi Prashanth - Sakshi

అన్నా.. రైతుబిడ్డ అన్నా.. ఒక రైతు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని నిరూపించాలనుకుంటున్నా అన్నా.. అంటూ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్‌. గ్రేట్‌.. అందరూ కలలు కంటారు, కానీ కొందరే దాన్ని నిజం చేసుకుంటారు. పల్లవి ప్రశాంత్‌ రెండో కేటగిరీలోకి వస్తాడు. ఎంతమంది ఎన్ని మాటలన్నా బిగ్‌బాస్‌ మాటనే జపం చేస్తూ పోయాడు. ఎలాగైనా ఈ సీజన్‌లో అడుగుపెట్టాలని కంకణం కట్టుకున్నాడు. చివరికి బిగ్‌బాస్‌ టీమ్‌ అతడికి ఆఫర్‌ ఇచ్చింది. ఏడో సీజన్‌లోకి అతడిని ఆహ్వానించింది.

రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయో బిగ్‌బాస్‌ ద్వారా అందరికీ తెలియజేస్తానన్నాడు ప్రశాంత్‌. కానీ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి రతికతో పులిహోర కలుపుతూ తెగ సిగ్గుపడిపోతున్నాడు. అయితే టాస్కులో మాత్రం తగ్గేదేలే అన్న లెవల్‌లో ఆడుతూ తాను అందరికీ టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. తాజాగా అతడు హౌస్‌లో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. హౌస్‌లో ఎవరో తిన్నప్పుడు కింద మెతుకులు పడటం గమనించాడు ప్రశాంత్‌. అది చూసిన అతడు ఎవరూ లేనప్పుడు అక్కడికి వెళ్లి ఆ రెండు,మూడు ఎంగిలి మెతుకులు ఏరి.. కెమెరాలకు చూపిస్తూ తిన్నాడు. అన్నం పడేస్తే తాను తట్టుకోలేనట్లుగా ప్రవర్తించాడు.

ఇది కొంచెం ఓవర్‌గా ఉందని జనాలు అనుకున్నారో లేదో అంతలో మరో వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక్కడ ప్రశాంత్‌ తన ప్లేటులో తినగా మిగిలిపోయిన కూరను, కొంత అన్నాన్ని చెత్తబుట్టలో పడేశాడు. ఇది చూసిన జనాలు అవాక్కయ్యారు. అన్నం పడేయొద్దంటూ హౌస్‌లో ఎంగిలి మెతుకులు తిన్నావు, బయటేమో నీ ప్లేటులోని అన్నం మెతులకు చెత్తలో పడేశావు.. ఇంత ఓవరాక్టింగ్‌ అవసరమా? అని తిడుతున్నారు..

చదవండి: బేబి పెళ్లికొడుకు.. రియల్‌ లైఫ్‌లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్‌లు.. సూసైడ్‌ ఆలోచనలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement