హీరోయిన్ రష్మిక మందన్నాకు ఈ మధ్య గడ్డుకాలం నడుస్తోంది.తను ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడూ హైపర్ యాక్టివ్‌గా కనిపించే రష్మిక ఏడేళ్లలో నాలుగు భాషల్లో 17 సినిమాలు చేసింది. గ్లామర్ రోల్సే కాకుండా పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యమిచ్చే పాత్రల్లోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.
'పాఠశాలలో చదువుకున్నప్పుడు చాలా బాధ అనుభవించా. కుటుంబానికి దూరంగా హాస్టల్‌లో ఉండేదాన్ని. 800 మంది విద్యార్థులు ఉండేవారు. ఎవరూ నాతో సరిగా ఉండేవారు కాదు. నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి కావు. దీంతో నన్ను అపార్థం చేసుకునేవారు. రోజూ రాత్రి ఒంటరిగా వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. సాధారణంగా నాకు ఏ సమస్య వచ్చినా అమ్మకు చెప్పుకునేదాన్ని. ఎందుకు ఏడుస్తున్నావు? ప్రపంచంలో ఇంకా ఎన్నో పెద్ద సమస్యలున్నాయి. దీని గురించి పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేది. తనే నన్ను స్ట్రాంగ్‌గా మార్చింది.
చదువులో నేను కొంత వీక్.. సప్లిమెంటరీ పరీక్షల వల్ల డిగ్రీ కాలేజీలో ఆలస్యంగా జాయిన్ అయ్యాను. అప్పటికే జాయిన్ అయిన అందరూ గ్రూపులుగా ఫామైపోయారు. నేను లేటుగా వెళ్లడంతో ఒక్కదాన్నే సైలెంట్‌గా కూర్చునేదాన్ని. అప్పుడే మా టీచర్ వచ్చి ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో నా పేరు రాసింది. ఆశ్చర్యంగా నేను ఫ్రెష్ ఫేస్ ఆఫ్ బెంగళూరుగా నిలిచాను. నా ఫోటో పేపర్‌లో వచ్చింది. అప్పుడు నాపై నాకు నమ్మకం కలిగింది. పది పదిహేను ఆడిషన్స్‌కు వెళ్లాను. ఓ సినిమా మొదలైన మూడునెలలకే ఆగిపోయింది. కానీ తర్వాత సంవత్సరం నాకు రిషబ్ సార్ ఫోన్ చేసి కిరిక్ పార్టీ ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా వల్లే నా కెరీర్ మొదలైంది. ఈమధ్య కాలంలో నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నేనే తప్పూ చేయలేదు. అయినా సరే విమర్శిస్తున్నారు. కానీ విమర్శ హద్దు దాటితే మాత్రం ఊరుకునేది లేదు' అని వార్నింగ్ ఇచ్చింది రష్మిక.
చదవండి: డైరెక్టర్‌కు మెగాస్టార్ కాస్ట్‌లీ గిఫ్ట్
ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment