
ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ మే 25న తన 50వ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సెలబ్రిటీలను విందుకు ఆహ్వానించి మంచి పార్టీ ఇచ్చాడు. అయితే బాలీవుడ్ స్టార్స్‌కే కాకుండా టాలీవుడ్‌లోని కొందరు తారలకు సైతం పార్టీకి ఆహ్వానం అందింది. దీంతో పార్టీకి పోదాం చలో చలో అంటూ పలువురూ కరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. రష్మిక మందన్నా, రకుల్ ప్రీత్ సింగ్, చార్మీ కౌర్, పూజా హెగ్డే, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, తమన్నా పార్టీలో తళుక్కుమని మెరిశారు.
అయితే బర్త్‌డే వేడుకల్లో రష్మిక తన డ్రెస్‌తో కొంత అవస్థ పడినట్లు కనిపించింది. అది కాస్తా కెమెరాలకు చిక్కగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో నడుచుకుంటూ వస్తోంది. ఆ డ్రెస్ కాళ్ల కిందవరకు ఆనుతుండటంతో నడవడానికి కొంత ఇబ్బంది పడింది హీరోయిన్. పదే పదే దాన్ని సర్దుతూ కొంత అసౌకర్యానికి లోనైనట్లు కనిపించింది. ఇది చూసిన జనాలు కంఫర్ట్‌గా లేనప్పుడు అదే డ్రెస్ ఎందుకు వేసుకోవడం అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి డ్రెస్ వేసుకుని అంత ఇబ్బంది పడటం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి 👇
కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్
Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే..
Comments
Please login to add a commentAdd a comment