Netizens trolled Shilpa Shetty for her bold outfit at award event - Sakshi
Sakshi News home page

Shilpa Shetty: మీ వయసు ఏంటీ.. ఆ డ్రెస్‌ ఏంటీ? ఉర్పీని ఫివర్‌ అట్టుకుందా: శిల్పాశెట్టిపై ట్రోల్స్‌

Published Mon, Feb 27 2023 10:47 AM | Last Updated on Mon, Feb 27 2023 11:21 AM

Netizens Trolled Shilpa Shetty For Her Bold Dress at Award Function - Sakshi

శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంతటి పాపులారిటి దక్కించుకుందో విమ్శరలతో కూడా అంతే గుర్తింపు పొందింది. ఏదొక వివాదంతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఓ నటుడితో ముద్దు కేసు, చీటింగ్‌, భర్త పోర్న్‌గ్రాఫీ, అక్రమ సంపాదన ఇలా పలు వివాదాలు ఆమెను చూట్టుముడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన డ్రెస్సింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసులో కూడా ఓ అవార్డు ఫంక్షన్‌లో యంగ్‌ హీరోయిన్లకు పోటీగా అందాల అరబోస్తూ బోల్డ్‌ లుక్‌లో దర్శనిమించింది.

చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడో తెలుసా?

దీంతో నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో బిగ్‌ ఇంపాక్ట్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. దీనికి శిల్పాతో పాటు పలువురు స్టార్‌ నటీనటులు హజరయ్యారు. ఈ వేడుకకు శిల్పా ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ట్రెండీవేర్‌ డ్రెస్‌లో సందడి చేసింది. వైట్‌కలర్‌ జంప్‌ సూట్‌లో వీ నెక్‌ ఫుల్‌ డీప్‌ జాకెట్‌, స్టైలిష్‌ చికంకారి కోట్‌ ధరిచించింది. ఇందులో శిల్పా డ్రెస్పింగ్‌ బోల్డ్‌గా ఉండటంతో అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌గా మారాయి.

చదవండి: షాకింగ్‌: నటుడిపై వేధింపులు.. మహిళా డైరెక్టర్‌ అరెస్ట్‌

దీంతో నెటిజన్లు శిల్పా డ్రెస్సింగ్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి డ్రెస్‌లు ఏంటీ? అంటూ శిల్పాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరికొందరైతే ఉర్ఫీ జావేద్‌ ఫివర్‌ అంటుకుందా? ఆమెను డామినేట్‌ చేయాలని చూస్తున్నారా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఆమె ఫ్యాన్స్‌ ‘ప్లీజ్‌ మేడమ్‌ ఇలాంటి డ్రెస్‌లు వేయకండి.. మీ మీద చాలా గౌరవం ఉంది, దాన్ని పొగొట్టుకోకండి’ అంటూ స్పందిస్తున్నారు. కాగా ఈ అవార్డు వేడుకకు హీనా ఖాన్ సహా మలైకా ఆరోరా వంటి ఇతర నటీమణులు కూడా హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement