ఉర్ఫీ జావెద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో ఈ భామ ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది.
చదవండి: అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి
అయినప్పటికీ ఉర్ఫీ తీరు మార్చుకోకపోగా.. రోజుకో వేషధారణలో దర్శనమిస్తోంది.ఎప్పుడు కట్ కట్ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చే ఉర్ఫీ.. ఈసారి తన ఫ్యాషన్‌లో పీక్స్‌కు వెళ్లింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రిల్ వీడియోలో.. ఉర్ఫీ తన ప్రింటెడ్ ఫొటోలతో చేసిన క్యూబ్ డ్రెస్‌ను ధరించి మరోసారి నెటిజన్లు నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. కాగా అమెరికన్ ర్యాపర్ నిక్కీ మినాజ్ స్వల్లా పాటకు లిప్‌సింక్ ఇస్తూ ఓ రీల్ చేసింది ఉర్ఫీ.
చదవండి: సౌత్ ఇండస్ట్రీపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్
ఈ రీల్‌లో తన ఫొటోలను కొన్నింటిని తీసుకుని వాటిని జత చేసి ఫొటో క్యూబ్ డ్రెస్‌గా మలుచుకుంది. దీనిపై రీల్ చేస్తూ ఉర్ఫీ వీడియో షేర్ చేసింది. ‘దయచేసి రియల్ ఉర్ఫీ కోసం నిలబడతారా? ఇంటర్నేట్‌లో చూశాను. దీన్ని మళ్లీ రీక్రియేట్ చేయాలని అనుకున్నా, అదే ఇది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆమె లుక్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె తీరు తెలిసిన కొందరూ ఉర్ఫీ లుక్‌పై వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. ‘ఆమె ఫ్యాషన్ పిచ్చి పీక్స్ వెళ్లిందని, ఇదేం స్టైల్ రా బాబు?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment