ఉర్ఫీ జావెద్.. ఈమె పేరు వినగానే చాలామందికి ఆమె వేసిన డ్రెస్సులే గుర్తొస్తాయి. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే ఈ బ్యూటీ పలుమార్లు ట్రోలింగ్ బారిన పడింది. పాపా.. నీ డ్రెస్సులు నువ్వే డిజైన్ చేసుకుంటావా? లేదా ఎవరైనా మహానుభావులు వాటిని కత్తిరించి నీకిస్తారా? అని రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఆమె హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ షేర్ చేసిన ఫొటోషూట్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చొక్కాను తిరగేసి ధరించినట్లుగా ఉన్న ఓ డ్రెస్సుతో ఆమె ఫొటోలను పోజులిచ్చింది.
ఇది చూసిన నెటిజన్లు.. ఈ స్టైల్ పేరేంటో తెలుసా? ఉల్టా షర్ట్, ఈమె మెదడు మోకాలిలో ఉందని మరోసారి నిరూపించింది, చొక్కా రివర్స్‌లో ధరిస్తే దాన్ని మోడలింగ్ అనరు, పిచ్చి అంటారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉర్ఫీ జావెద్ లాకప్ షో చేస్తుందని గత కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అదంతా వుట్టి పుకార్లేనని, తాను ఈ షో చేయడం లేదని క్లారిటీ ఇచ్చిందీ భామ.
Comments
Please login to add a commentAdd a comment