Actress Urfi Javed Gets Trolled After Shares His Hot Pics - Sakshi
Sakshi News home page

ఆమాత్రం దానికి దుస్తులు ఎందుకు వేసుకున్నావ్‌?.. నెటిజన్ల ఫైర్‌

Published Mon, Dec 20 2021 5:42 PM | Last Updated on Tue, Dec 21 2021 7:28 AM

Urfi Javeds Designer Gets Trolled After Actor Shares Hot Pics - Sakshi

సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీలు ట్రోలింగ్‌కు గురవడం సర్వసాధారణమైపోయింది. తాజాగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఉర్ఫీ జావెద్‌ సైతం ట్రోలింగ్‌ బారిన పడింది. లేటెస్ట్‌ ఫ్యాషన్‌ డ్రెస్సులతో సందడి చేసే ఈ బిగ్‌బాస్‌ భామ ఓ కొత్తరకం డ్రెస్సుతో దర్శనమిచ్చింది. ఓపెన్‌కట్‌ టాప్‌, పొట్టి స్కర్ట్‌తో బోల్డ్‌గా దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఈ డిజైనర్‌ డ్రెస్‌లో ఆమె అందాల ఆరబోతకు అడ్డు లేకుండా పోయింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఉర్ఫీని ఆడేసుకుంటున్నారు. అసలు ఏ బట్టలు వేసుకోవాలనుకున్నావ్‌..అని ఒకరు ప్రశ్నించగా ‘ఆ మాత్రం దుస్తులు కూడా ఎందుకు వేసుకున్నావ్‌..’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి బట్టలు వేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉర్ఫీకి ఈ ట్రోలింగ్‌ కొత్తేమీ కాదు. ప్రియాంక చోప్రా పోనీటైల్‌ హెయిర్‌ స్టైల్‌ను కాపీ చేసిందంటూ ఆమెను ట్రోల్‌ చేశారు. జడ అల్లుకోవడం కూడా కాపీయే అంటే ఈ సమాజం తలదించుకోవాలంటూ ట్రోలింగ్‌కు ఘాటు రిప్లై ఇచ్చింది ఉర్ఫీ జావెద్‌.

చదవండి: అలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి: సన్నీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement