Shraddha Das Getting Trolled For Supporting Anasuya Bharadwaj - Sakshi
Sakshi News home page

Shraddha Das: అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు?

Published Sat, Aug 27 2022 4:07 PM | Last Updated on Sat, Aug 27 2022 6:54 PM

Shraddha das Getting Trolled For Supporting Anasuya Bharadwaj - Sakshi

ఆంటీ.. ఆంటీ.. ఆంటీ.. ట్విటర్‌లో ఎక్కడ చూసినా ఇదే పదం కనిపిస్తోంది. సుమారు 60 వేల ట్వీట్లు, మీమ్స్‌, కామెంట్లు, వీడియోలతో ట్విటర్‌ హోరెత్తిపోతోంది. ఆంటీ అని పిలవడం ఏజ్‌ షేమింగ్‌ అని అనసూయ మండిపోతుంటే.. మేము మాత్రం ఆంటీ అని పిలవడం మానేదే లేదని మరింత రెచ్చిపోతున్నారు నెటిజన్లు. ఈ వివాదంలోకి శ్రద్దా దాస్‌ ఎంటరవుతూ అనసూయకు సపోర్టిచ్చింది. నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే చాలా అందంగా ఉంటావు. నీకంటే రెట్టింపు వయసున్న అంకుల్స్‌ కన్నా కూడా నువ్వే హాట్‌గా కనిపిస్తావు. ఎల్లప్పుడూ నీకు అభిమానినే అని రాసుకొచ్చింది.

ఇంకేముంది.. అనసూయను సపోర్ట్‌ చేస్తావా? అని శ్రద్దాను కూడా ఏకిపారేశారు. దీంతో షాకైన హీరోయిన్‌.. 'నన్ను తిట్టుకుంటూ మీ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. మీరు నన్ను దూషించిన ట్వీట్లన్నీ డిలీట్‌ చేస్తా, అలాగే మీ ఖాతాలను కూడా బ్లాక్‌ చేస్తాను. అనసూయ లుక్స్‌ను పొగిడినందుకు నన్ను ట్రోల్‌ చేయడంలో అర్థం లేదు' అని ట్వీట్‌ చేసింది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'అనసూయ ఏం చేస్తుందో మీకు తెలీదు. ఎప్పటినుంచో ఉన్న అక్కసును ఓ హీరోపై ఇప్పుడు వెల్లగక్కుతోంది. అనవసరంగా ఆమెకు సపోర్ట్‌ చేయకండి' అని పేర్కొన్నాడు.

కాగా అనసూయ గురువారం నాడు.. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమోకానీ, రావడం మాత్రం పక్కా!' అని ఆమె ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే కదా! ఇది హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశించే పెట్టిందని అభిప్రాయపడ్డ అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయ మీద మండిపడుతూ వరుస పోస్టులు పెడుతున్నారు. దీనిపై మండిపడ్డ యాంకర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని నెటిజన్లు ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేస్తున్నారు. అటు అనసూయ కూడా తగ్గేదే లే అన్నట్లుగా #SayNOtoOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్‌తో రిప్లై ఇస్తూ వస్తోంది. మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!

చదవండి: పెద్దపులితో ఎన్టీఆర్‌ పోరాటం.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ సీన్‌ ఎలా తీశారంటే..
ఓటీటీలో రామారావు ఆన్‌ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement