పంద్రాగస్టు రోజున స్కూలు, కాలేజీలు, కార్యాలయాలే కాకుండా ప్రతి ఇంట జెండా ఎగరేశారు. హర్ ఘర్ తిరంగా పేరిట చాలామంది ఇళ్లల్లో జెండా రెపరెపలాడింది. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా ఈ ట్రెండ్‌లో పాలు పంచుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలోని జుహులో తన ఇంటి ముందు జెండాను ఎగరేసింది.
ఈ క్రమంలో ఆమె చెప్పులు ధరించే జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండావందనం చేసింది. ఈ వీడియోను శిల్పా శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. చెప్పులేసుకుని ఫ్లాగ్ ఎగరేయడమేంటి? కాస్తైనా బుద్ధుండక్కర్లా? అని మండిపడ్డారు. నీ చెప్పులు పక్కన విడిచి ఆ పని చేస్తే బాగుండేది అని సెటైర్లు వేశారు. అయితే కొందరు మాత్రం చెప్పులు వేసుకుని జెండా ఎగరేయడంలో తప్పే లేదని హీరోయిన్‌ను వెనకేసుకొచ్చారు.
ఈ ట్రోలింగ్ చూసిన శిల్పా.. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై తనకు పూర్తి అవగాహన ఉందని కౌంటరిచ్చింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్‌లో ఎక్కడా లేదంటూ గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ షేర్ చేసింది. 'ఇలా పనిగట్టుకుని విమర్శలు చేసేవాళ్లను నేనసలు పట్టించుకోను. మీ అజ్ఞానాన్ని ప్రచారం చేయడం, నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకోవడం మెచ్చుకోదగిన విషయం కాదు. ముందు మీరు వాస్తవాలు తెలుసుకుని అప్పుడు మాట్లాడండి' అని ఘాటుగా బదులిచ్చింది.
చదవండి: రెండేళ్లకే విడాకులు.. హీరోయిన్ జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా?
Comments
Please login to add a commentAdd a comment