
నటీనటులు వేసుకునే మేకప్, డ్రెస్సింగ్ అనేది వారికి నచ్చితే సరిపోదు.. చూసేవాళ్లకు కూడా నచ్చాలి! లేదంటే నెటిజన్లు నోరేసుకుని పడిపోతారు. అదేం డ్రెస్సు, నీకేది దొరకలేదా? సరిగ్గా మేకప్ వేసుకోవడం కూడా రాదా? కనీసం ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియదా? అని తిట్టిపోస్తారు. అందుకే నలుగురిలోకి వచ్చేటపుడైనా, కెమెరా ముందు నిలబడే ముందైనా అందంగా రెడీ అవ్వాల్సిందే! లేదంటే తిప్పలు తప్పవు. ఇక అందం కోసం, ఆకృతి కోసం డైటింగ్ సరే సరి! ఏమాత్రం బొద్దుగా కనిపించినా నానార్థాలు తీస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు.
అందుకు ఇప్పుడు చెప్పుకునే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. భోజ్‌పురి నటి త్రిష కర్ మధు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నేను నీ సొంతం కాదు అని దీనికి క్యాప్షన్ జత చేసింది. ఇందులో ఆమె బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ శారీలో మెరిసింది. అయితే ఈ ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. ఇంకేముంది, ఇది చూసిన నెటిజన్లు ఏంటి? అంత లావయ్యావు. అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యావా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కాగా గతేడాది త్రిష కర్ మధుకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో లీకైంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దయచేసి ఆ వీడియోను డిలీట్ చేయాలని అభ్యర్థించింది నటి. ఈ వీడియో దుమారం ముగిసిన తర్వాత తిరిగి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తోంది త్రిష.
Comments
Please login to add a commentAdd a comment