
The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్.. మార్చి 11న రిలీజైందీ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.97.30 కోట్లు రాబట్టింది. కంగనా రనౌత్, వరుణ్ ధావన్, యామీ గౌతమ్ వంటి పలువురు సెలబ్రిటీలు కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ సినిమా పేరెత్తకుండా దాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
'T 4222 - అంతకుముందు తెలియనిది ఇప్పుడు తెలిసింది' అంటూ బిగ్‌బీ ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మీకు సినిమా పేరును ప్రస్తావించే ధైర్యం కూడా లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 'కశ్మీర్ ఫైల్స్ అని టైప్ చేయడానికి ఇంతలా భయపడుతున్నారా?', 'మరీ పిరికిపందలా మాట్లాడుతున్నారు బచ్చన్ సార్, డైరెక్ట్‌గా పొగడవచ్చు కదా, దేనికీ దాగుడుమూతలు?', 'మీరు ఇప్పుడు ఏదైతే తెలిసింది అంటున్నారో, దాన్ని ఎప్పుడూ తెలుసుకోవాలని అనుకోలేదు' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఆడేసుకుంటున్నారు.
T 4222 - .. we know now , what we never knew then ..
— Amitabh Bachchan (@SrBachchan) March 16, 2022
చదవండి: ఇది నా జీవితంలో జరిగింది, అర్ధరాత్రి కశ్మీర్‌ను వీడాం: నటి ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment