నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన | Rashmika Mandanna Respond on To Being Trolled For Using Air Quotes | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై తొలిసారి స్పందించిన రష్మిక

Published Sat, Jan 7 2023 10:36 AM | Last Updated on Sat, Jan 7 2023 11:30 AM

Rashmika Mandanna Respond on To Being Trolled For Using Air Quotes - Sakshi

రష్మిక మందన్నా కొద్ది రోజులుగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కన్నడీగులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల కాంతార నటుడు రిషబ్‌ శెట్టిపై ఆమె చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తనని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు, నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండో సో కాల్డ్‌ అంటూ ప్రస్తావించింది. రీసెంట్‌గా తన బాలీవుడ్‌ చిత్రం మిషన్‌ మజ్ను ఈవెంట్‌లో సౌత్‌ ఇండస్ట్రీ పాటలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. సౌత్‌ సినిమాల్లో కేవలం మాస్‌ సాంగ్స్‌యే ఉంటాయని, రొమాంటిక్‌ సాంగ్స్‌ అంటూ నార్త్‌ మూవీస్‌ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.

చదవండి: త్రిషకు షాక్‌! తెరపైకి కాజల్‌ అగర్వాల్‌?

దీంతో రష్మికకు దక్షిణాదిన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆమె సౌత్‌ నుంచి బ్యాన్‌ చేయాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనపై వస్తున్న వ్యతిరేకతపై రష్మిక స్పందిందించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘నటి అయినంత మాత్రాన అందరు ఇష్టపడతారని చెప్పలేం. ఇక్కడ ద్వేషం ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఉంటుంది. నేను ఓ పబ్టిక్‌ సెలబ్రెటీని. మనం వారితోనే ఉంటాం, వారితోనే మాట్లాడుతుంటాం. ఈ క్రమంలో కొందరికి నా తీరు నచ్చకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు, నా ఎక్స్‌ప్రెషన్స్‌, చేతులతో చేసే సంజ్ఞలు నచ్చి ఉండకపోవచ్చు.

చదవండి: ఆ స్టార్‌ హీరో నాకు ఫోన్‌ రాత్రికి రమ్మన్నాడు: నటి

ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నేనంటే ప్రేమ ఉండి ఉంటుంది కదా. అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా కాంతార మూవీ సమయంలో రష్మికను సినిమా చూశారా? అని రిపోర్టర్ అడగ్గా.. ఆ సినిమా చూడలేదు అని చెప్పింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతివేళ్లతో సైగ చేసి చూపించింది. అ‍ప్పటి నుంచి రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ ఉద్దేశిస్తూ తరచూ కాంట్రవర్సల్‌ కామెంట్స్‌ చేస్తూ వస్తోంది. ఇక ఆమె తీరుపై కన్నడ ప్రేక్షకులతో పాటు శాండల్‌వుడ్‌ సెలబ్రెటీలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement