Manchu Vishnu Clarity On Tweet About RS 2000 Notes In Vennela Kishore - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: ఆ విషయం అర్థం కాకపోతే మీకు దేవుడే దిక్కు: మంచు విష్ణు

Published Thu, May 25 2023 7:58 PM | Last Updated on Thu, May 25 2023 8:17 PM

Manchu Vishnu Clarity On Tweet About RS 2000 Notes In Vennela Kishore  - Sakshi

మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు ఇటీవల చేసిన ట్వీట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలు కుప్పలుగా రెండు వేల నోట్లు ఉన్నాయంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ నిజమా అంటూ ఆరా తీశారు. దీంతో ఇదంతా ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. వెన్నెల కిశోర్ ఇంత డబ్బు సంపాదించాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మీడియాలో వచ్చిన కథనాలపై మంచు విష్ణు ట్వీట్ చేశారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు. 

(ఇది చదవండి: వెన్నెల కిషోర్‌ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్‌)

మంచు విష్ణు తాజాగా ఓ ట్వీట్‌తో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా నేను చేసిన జోక్ అని అందరికీ తెలుసు అంటూ పోస్ట్ చేశారు. ఇది అర్థం చేసుకోలేని వారిని ఆ దేవుడే రక్షించాలి అంటూ రాసుకొచ్చారు. కానీ కొంత మంది మీడియా వ్యక్తులు వెన్నెల కిషోర్ మీద వేసిన జోక్‌ను సీరియస్‌గా తీసుకన్నారని ట్వీట్‌లో తెలిపారు. 

మంచు విష్ణు ట్వీట్‌లో రాస్తూ..'అది జోక్ అని అందరికీ తెలుసు. కాసింత కళాపోషణ ఉన్న వారెవ్వరికైనా అది జోక్ అని అర్థమవుతుంది. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకోని వాళ్లని ఆ దేవుడే కాపాడాలి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరూ జిన్నా సినిమాలో చివరగా కలిసి నటించిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement