
మాకు ఓ రూ.30 లక్షలు ఇవ్వొచ్చుగా, అర్జంట్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లకు చెప్పేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే విష్ణు సరదానా అన్న మాటలను సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు ఇది నిజమా సర్.. ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సాయం చేస్తారా బ్రో, అన్నా.. పేదలకు పంచవచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ మాత్రం నెట్టింట
కొంతకాలంగా రెండు వేల నోటు కనిపించకుండా పోయింది. ఎక్కడో ఒక చోట తప్పితే పెద్దగా చలామణీ అవడం లేదు. ఈ క్రమంలో రూ.2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కాకపోతే మన దగ్గర ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. ఇకపోతే కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో రెండు వేల నోట్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయట. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. రెండు వేల నోట్ల కట్టలు గుట్టగా పేరుకుని ఉన్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. 'వెన్నెల కిశోర్ ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఫోటో తీసుకున్నాను. ఈ నోట్లతో అతడేం చేస్తాడోనని నాకు ఆశ్చర్యంగా ఉంది' అని రాసుకొచ్చాడు.
దీనికి వెన్నెల కిశోర్ స్పందిస్తూ.. 'సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్‌ను చంపేసినట్లు.. నామీద పడతారేంటి?' అని డైలాగ్ ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు 'మాకు ఓ రూ.30 లక్షలు ఇవ్వొచ్చుగా', 'అర్జంట్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లకు చెప్పేయాలి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే విష్ణు సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు 'ఇది నిజమా సర్..', 'ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సాయం చేస్తారా బ్రో', 'అన్నా.. పేదలకు పంచవచ్చు కదా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక పెద్ద నోట్ల రద్దుతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోటును లీగల్‌గా చలామణి చేసుకునే అవకాశం ఉన్నా ఎవరు కూడా దాన్ని తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. షాపింగ్, మాల్స్, వైన్ షాప్స్, పెట్రోల్ బంకుల్లో కూడా నోటును తీసుకునేందుకు సిబ్బంది వెనుకడుగు వేస్తున్నారు.
Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA
— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023
చదవండి: మరో వ్యాపార రంగంలోకి నయనతార