తెలుగు ప్రజల  ఓటు మోదీకే: దత్తాత్రేయ | Both states Narendra Modi Voted for Telugu people Says Dattatreya | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల  ఓటు మోదీకే: దత్తాత్రేయ

Published Mon, Apr 1 2019 3:57 AM | Last Updated on Mon, Apr 1 2019 3:57 AM

Both states Narendra Modi Voted for Telugu people Says Dattatreya - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు నరేంద్ర మోదీకే ఓటు వేస్తారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల్లో దేశం కోసం మోదీ, మోదీ కోసం దేశం అనే భావం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమితో పాటు, ఎల్‌బీనగర్‌ ప్రచారసభ జనం లేక వెలవెలపోవడం టీఆర్‌ఎస్‌కు అపశకునాలేనన్నారు. బీజేపీ కార్యాలయం లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడొందలకు పైగా స్థానాలు గెలుచుకుని కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు.

మోదీ ప్రభుత్వంలో టీడీపీతో సహా ఏ పార్టీ అయినా భాగస్వామ్యం అవుతుందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ దుకాణం త్వరలోనే బంద్‌ అవుతుందన్నారు. సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏప్రిల్‌ 4న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కరీంనగర్, వరంగల్‌ బహిరంగసభల్లో, 2న నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో జరిగే సభలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొంటారని చెప్పార 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement