
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, టీఆర్‌ఎస్ పార్టీలు కుటుంబ పాలన పార్టీలని బీజేపీ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ కంటే భిన్నమైన, నైతిక విలువలు ఉన్నపార్టీ అని కొనియాడారు. బీజేపీ సేవా భావంతో పని చేసే విలువలు గల పార్టీ అని అన్నారు.
నైతిక విలువలు లేని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ ప్రధాన మంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పేరు వస్తుందని ప్రధాన మంత్రి ఫసల్ రైతు యోజనా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలులో చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ తండాకు కోటి రూపాయలు తో నాబార్డు నిధులతో రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 8 లక్షల కోట్లు రూపాయలు చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment