సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తుండటంతో ఆయనను విమర్శించే విష యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెత్తబడ్డారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఏపీ ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న అనుమానంలో చంద్రబాబు ఉన్నారని, అందు కే మోదీని విమర్శిస్తే ఇక లాభం లేదని గ్రహిం చి ఇల్లు సర్దుకొనే పనిలో పడ్డారన్నారు. బుధవారం ఢిల్లీలో దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం చూసి టీడీపీ, టీఆర్‌ఎస్‌లతోపాటు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కూటమిలో కలవరపాటు మొదలైందన్నారు. ఇన్ని రోజులు ప్రధానిపై దుష్ప్రచారం చేసిన బాబు దాన్ని తగ్గించారని గుర్తు చేశారు. ఇదంతా దేశవ్యాప్తంగా ప్రజలు మోదీని కోరుకుంటుండటమే కారణమన్నారు. టీడీపీకి సీనియర్ నేతలు, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం రాజీనామాలు చేసి వైఎస్సార్‌సీపీలో చేరిపోతుండటంతో బాబు ఆత్మావలోకనంలో పడ్డారన్నా రు.
ఇక కేంద్రంలో సర్కారు ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని అం టున్న టీఆర్‌ఎస్ నేతలవి పగటి కలలే అని, టీఆర్‌ఎస్ మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. తమను తక్కువ అంచనా వేయవద్దని హితవు పలికారు. ‘న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా, యునైటెడ్ ఇండియా’ లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందని చెప్పారు. ఇక కేంద్రం ఇటీవల ఈడబ్ల్యూఎస్‌లకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయడం లేదని, రిజర్వేషన్లను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వా నికి ఆదేశాలివ్వాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్టు తెలిపారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గా తానే బరిలో ఉంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment