సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్‌కు ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..)
దత్తాత్రేయను కలిసిన డీజీపీ..
పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన బండారు దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. గేట్ వే హోటల్‌లో ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు.(చదవండి: అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం)
Comments
Please login to add a commentAdd a comment