
ముషీరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన బండారు విజయలక్ష్మికి బీఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీ కరపత్రాన్ని అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం అడిక్‌మెట్ డివిజన్‌లో ప్రచార కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ నివాసం ఉండే గల్లీలో బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బల్లా శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్, సయ్యద్ అస్లాం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
అదే వరుసలో ఉన్న దత్తాత్రేయ నివాసానికి వెళ్లగా విజయలక్ష్మికి కరపత్రాన్ని అందించి ముఠా గోపాల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆమె చిరునవ్వుతో కరపత్రాన్ని స్వీకరించి వారితో ఫొటో దిగారు. కార్యక్రమంలో నాయకులు కొండపల్లి సాయిప్రసన్న, ఇంద్రసేనారెడ్డి, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, చంద్రశేఖర్, మహ్మద్ జహంగీర్, రోషం బాలు తదితరులున్నారు.
దత్తన్న కుమార్తె విజయలక్ష్మికి బీఆర్‌ఎస్ కరపత్రం
Comments
Please login to add a commentAdd a comment