
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన ఎస్పారెస్పీ, నిజాం సాగర్, సింగూరు నీళ్లు లేక ఎండిపోతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం కాళేశ్వరం నీళ్లొస్తున్నాయంటూ మాటలతో ఊరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా కన్వీనర్ సుధాకరశర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఓవైపు గోదావరి వరదలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయంటూ మాటలతో ఊరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి అన్నారం సుందిళ్ల, ఎల్లంపల్లి ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందించారో సీఎం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.