
సాక్షి, హైదరాబాద్ : ఓట్ల గల్లంతుపై రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌కు బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, రాంచదర్‌రావు ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని దత్తాత్రేయ తెలిపారు. మల్కాజ్‌గిరిలో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారని, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నామన్నారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ చొరవ చూపాలని కోరారు. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. విజయ సంకల్ప దివస్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపై దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్‌లో కార్యక్రమం చేసుకుంటామంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు.