
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర పరిపాలనా స్థితిగతులపై చర్చించినట్లు తెలిసింది.
బొకేలు వద్దు.. బుక్స్ తెండి
తనను కలిసేందుకు వచ్చేవారు పూలబొకేలకు బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీలు, చిన్న పిల్లల కథల పుస్తకాలు తీసుకురావాలని గవర్నర్ తమిళిసై కోరారు. వీటిని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు పంపిణీ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.