![Bandaru Dattatreya Takes Oath As Himachal Pradesh Governor - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/11/bandaru.jpg.webp?itok=ORPFIEzl)
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ ఆయనచే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాలయ సంప్రదాయ టోపీ దరించి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు బీజేపీ నేతలు, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment