అంబానీ డ్రైవర్‌ జీతం ఎంతో తెలిస్తే.... | Mukesh Ambani’s driver salary is 2 lakh for month | Sakshi
Sakshi News home page

అంబానీ డ్రైవర్‌ జీతం ఎంతో తెలిస్తే....

Published Tue, Oct 31 2017 5:45 PM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

Mukesh Ambani’s driver  salary is 2 lakh for month - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ సంపన్నుల్లో ఒకరు, రిలయన్స్‌ ఇండస్త్రీ అధినేత ముఖేష్‌ అంబానీ డ్రైవర్‌ జీతం ఎంతనుకుంటున్నారు? ఆ..ఆసియాలోనే అత్యధిక సంపన్నుడు అంబానీయే కనుక ఆయన హోదాకు తగ్గట్టుగా 50, 60 వేల రూపాయలో ఉంటుందని అనుకుంటాం. అసలు జీతం ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవడమే కాదు. ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ఆయన వద్ద డ్రైవర్‌ ఉద్యోగానికి వెళితే బాగుండని అనుకుంటాం. ఆయన డ్రైవర్‌ జీతం అక్షరాల నెలకు రెండు లక్షల రూపాయలు మరి. ఈ రోజుల్లో ఐటీ ఉద్యోగులకు దేశంలో అంతరావడం లేదు.

అయితే ఆయన డ్రైవర్‌ ఎంపికకు ఐటీ ఉద్యోగి ఎంపికకన్నా ఎక్కువగా ప్రక్రియ ఉంటుందట. అంబానీ తనకు డ్రైవర్‌ కావాలనుకున్నప్పుడు ఎంపిక చేసే బాధ్యతను ఓ కంపెనీకి కాంట్రాక్ట్‌ కింద అప్పగిస్తాడట. సదరు కాంట్రాక్ట్‌ తీసుకున్న కంపెనీ ఎంతోమంది అర్హులను పిలిచి వారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఇద్దరినో ముగ్గురినో ఎంపిక చేస్తుందట. ఆ ఇద్దరి, ముగ్గురులో తనకు ఎవరు కావాలో, ఎంత మంది కావాలనే అంశమై అంబానీ తుది ఎంపిక చేసుకుంటారట. ఎంపికకు కావాల్సిన ప్రమాణాలను కూడా అంబానీయే సూచిస్తారని తెల్సింది. అంబానీ మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసుకదా? 2,57, 900 కోట్ల రూపాయలు. ఆయన ఇల్లు కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇప్పుడు అంబానీ డ్రైవర్‌ జీతానికి సంబంధించిన అంశం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతకుముందు బాలివుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్‌ షెరా జీతం వివరాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసిన విషయం తెల్సిందే. ఆయన జీతం నెలకు 15 లక్షలు. జస్టిన్‌ బైబర్, మైఖేల్‌ జాక్సన్, విల్‌స్మిత్, పారిస్‌ హిల్టన్, జాకీ చాన్‌ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీలకు భద్రతా ఏర్పాట్లు చేసినందున షెరాకు అంత డిమాండ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement