వయసు ఏడేళ్లు.. సంపాదన లక్షల్లో! | Yoga master in less age | Sakshi
Sakshi News home page

వయసు ఏడేళ్లు.. సంపాదన లక్షల్లో!

Published Wed, Feb 7 2018 1:33 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Yoga master in less age - Sakshi

బీజింగ్‌: అనారోగ్యం నుంచి బయట పడేందుకు యోగాను ఆశ్రయించాడు. కఠోర సాధనతో ఆరోగ్యవంతుడయ్యాడు. అదే యోగాపై పట్టు సాధించి, ఇప్పుడు టీచర్‌గా మారాడు. ఇంతా చేసి ఇతని వయసు కేవలం ఏడేళ్లు! చైనాకు చెందిన ఈ బాలుడు అతిపిన్న వయస్కు డైన యోగా మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని తైఝౌకు చెందిన సున్‌ చుయాంగ్‌కు రెండేళ్లప్పుడే ఆటిజం ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. దాన్నుంచి బయట పడేసేందుకు వైద్యుల సూచన మేరకు యోగా క్లాసులకు పంపడం ప్రారంభించారు. ఏడాది యోగా సాధన తర్వాత సున్‌కు ఆటిజం దూరమైంది. యోగాపై మక్కువ పెంచుకున్న సున్‌ సాధన ఆపకుండా యోగా టీచర్‌గా మారాడు. సున్‌ ప్రస్తుతం టీవీ షోల్లో పాల్గొంటున్నాడు. మూడు సినిమాల్లోనూ నటించాడు. ఇప్పటి వరకు అతడు రూ.10 లక్షలు సంపాదించాడని తల్లిదండ్రులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement